స్త్రీ సంరక్షణ శాఖలో ఇంటర్న్షిప్‌లు

The Women Safety Wing of Telangana Police provides numerous opportunities for students to intern across diverse areas.Internship opportunities are avaialble round the year and applications are reviewed against emerging project opportunities.

Internships with WSW provides exposure to students on the functioning of the department, initiatives, research and statistical works. Please click here to apply for internship opportunities.

దేశంలో ఎక్కడనుండి అయినా అర్హతగల విద్యార్థులు అప్లికేషన్ వేసేందుకు ఆహ్వానితులే, అర్హత మరియు ఎంపిక ప్రమాణాలు క్రింది విధంగా ఉంటాయి:

  1. రెగ్యులర్ విధానంలో విశ్వవిద్యాలయం/ఇన్స్టిట్యూషన్ నుండి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్-గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు అర్హులు.
  2. వయస్సు 25 సంవత్సరాలకంటే తక్కువ ఉండాలి
  3. 250 పదాలతో తెలంగాణ పోలీసు వారి స్త్రీ సంరక్షణ విభాగంలో ఎందుకు చేరాలనుకుంటున్నారో నివేదిక (SoP) ఇవ్వాలి. ఈ నివేదిక అప్లికేషన్ తోపాటు సమర్పించాలి, ఇదే ఇంటర్న్ లను ఎన్నుకునేందుకు ఆధారంగా ఉంటుంది.
  4. ఎంపిక అవకాశాలు మెరుగయ్యేందుకు SoP, సహ-పాఠ్య కార్యకలాపాలు, ఇంటర్న్షిప్‌లు, విజయవంతమైన పరిశోధన ప్రాజెక్టులు, NGOలతో పని/ప్రాజెక్టులు వంటి వివరాలు సహకరిస్తాయి. 
  5. లాప్-టాప్ లేదా డెస్క్-టాప్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
  6. ప్రతి బ్యాచ్ కు అత్యధికంగా 10 మందికి మాత్రమే ఇంటర్న్‌షిప్‌లు ఇవ్వడం జరుగుతుంది.
  7. పూర్తిగా మెరిట్ ఆధారంగా, ఇంటర్న్‌ల ఎంపిక WSWచే నియమించబడిన ఎంపిక కమిటీ ద్వారా చేయబడుతుంది.

ఇంటర్న్‌ గా ఉన్న సమయంలో విద్యార్థి యొక్క పాత్రలు మరియు బాధ్యతలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  1. ప్రణాళిక, కంటెంట్ అభివృద్ధి మరియు పరిశోధన సంబంధిత కార్యకలాపాలలో భాగస్వామ్యులుగా ఉండుట.
  2. స్త్రీ సంరక్షణ శాఖలో ఉన్నటువంటి వివిధ కార్యక్రమాలపై డేటా/సమాచారం సంకలనం.
  3. శిక్షణ, సెమినార్లు మరియు వెబినార్లు జరుగుతున్నప్పుడు పాల్గొనడం.
  4. ఔట్-రీచ్ కార్యకలాపాలకు సహకారం అందించుట.
  5. అవసరాన్ని బట్టి, ఇతర కార్యకలాపాలలో సహాయం.

సర్టిఫికేషన్

నియమిత సమయంలో విద్యార్థులు గనుక పోలీసు శాఖ వారు ఇచ్చిన పనికి సంబంధించిన కాగితం/నివేదికల సమర్పణ/ ప్రదర్శన వంటివి పూర్తి చేసినట్లు అయితే వారికి ఇంటర్న్షిప్‌ ధృవీకరణ పత్రం అందజేయబడుతుంది. ఇంటర్న్‌షిప్‌ ద్వారా ఎటువంటి జీతం లేదా పారితోషకం ఇవ్వబడదు అని విద్యార్థులు దయచేసి గమనించగలరు.

Furnishing undertaking & adhering to strict confidentiality -

  1. ఇంటర్న్‌షిప్ సమయంలో పొందిన ఎటువంటి ప్రచురింపబడని సమాచారాన్నైనా బహిర్గతం చేయకూడదు మరియు ఎంపికపై ప్రతి ఇంటర్న్ గోప్యత యొక్క ప్రకటనను (డిక్లరేషన్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ) అందించాలి.
  2. విద్యాభ్యాసం కోసం విద్యార్థి నమోదు చేసుకున్న సంస్థ యొక్క ఫర్నిషింగ్ లెటర్ ఆఫ్ రికమండేషన్.
  3. WSW వారు పరిశీలించిన ప్రకారం విద్యార్థి పని తీరు సరిగా లేకపోతే ఇంటర్న్‌షిప్ సమయం పూర్తి కాకుండానే మధ్యలో వారి ఇంటర్న్‌షిప్ రద్దు చేసే అధికారం ఉంటుంది.

ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ-మెయిల్ ద్వారా ఇంటర్న్‌షిప్ కు నమోదు చేసుకోవొచ్చు : intern[dot]tswomensafetywing[at]gmail[dot]com ఇంటర్న్‌షిప్ కోసం.

ఇతర వివరాలకు/సందేహాలకు, క్రింద తెలిపిన అధికారిని సంప్రదించగలరు -
శ్రీహర్షిత చడా,
కంటెంట్ డెవలపర్ & లీగల్ అసిస్టెంట్,
స్త్రీ సంరక్షణ విభాగం, తెలంగాణ రాష్ట్ర పోలీస్,
లక్డికపూల్, హైదరాబాద్ - 500004

ఇమెయిల్: intern[dot]tswomensafetywing[at]gmail[dot]com