NRI సెల్

సరిహద్దులు దాటి భద్రత

స్త్రీ సంరక్షణ విభాగం యొక్క NRI సెల్ NRI జీవిత భాగస్వాములు లేదా బంధువులు నిందితులుగా పేర్కొనబడిన కేసులను పరిష్కరించడానికి స్థాపించబడింది. ఈ సెల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎంబసీలు, నేషనల్ కమీషన్ ఫర్ విమెన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటెర్న్అఫైర్స్ వంటి స్టేక్‌హోల్డర్‌లతో అనుసంధానం అవుతూ NRI భర్త ద్వారా బాధకు గురవుతున్న భార్యకు సహాయం అందించడం. NIR సెల్ బాధితుల యొక్క బాధలను పంచుకోవడానికి మరియు సాధ్యమైనన్ని చట్టపరమైన మార్గదర్శకాలతో వారికి సహాయం చేయడానికి వేదికగా పనిచేస్తుంది.

మేము సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాము

మమ్మల్ని చేరుకోండి

NRI భద్రతా సెల్ ను ఎప్పుడు సంప్రదించవచ్చు?

NRI సెల్ గురించి

శ్రీ ఎమ్. మహేందర్ రెడ్డి, IPS, DGP, తెలంగాణ వారిచే స్త్రీ సంరక్షణ విభాగంలో శాఖగా NRI విమెన్ సేఫ్టీ సెల్ ను జులై 17, 2019న హైదరాబాద్ లో ప్రారంభించబడింది. నెట్వర్క్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీగల్ యాక్టివిస్స్ (NILA) అనే NGO మరియు ఇతర స్టేక్-హోల్డర్స్ ద్వారా NRI వివాహంలో బాధిత మహిళలకు న్యాయపరమైన మార్గదర్శకత్వం అందించాలనే ఉద్దేశంతో ఈ సెల్ ఏర్పాటు చేయబడింది. NRI భాగస్వాములు/బంధువుల వల్ల జరిగే వేధింపులకు సంబంధించిన కేసులలో మేము SHOలకు విచారణ సమయంలో మార్గదర్శకాలు అందజేయడం జరుగుతుంది. దర్యాప్తు ప్రక్రియలు మరియు సంబంధిత డాక్యుమెంటేషన్ తయారుచేయడానికి SHOలకు సరైన శిక్షణ ఇవ్వబడుతుంది.

పెండింగ్‌లో ఉన్న ట్రయల్ కేసులను త్వరగా పరిష్కరించేందుకు మేము సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడం మరియు నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ అయ్యేలా చూసుకుంటాము. విచారణ సమయంలో, ఛార్జ్ షీట్ నింపుతున్నప్పుడు మరియు ట్రయల్ సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి న్యాయ నిపుణుల సూచనలు తీసుకోవడం జరుగుతుంది, NRI కేసులలో బాధితులు/ఫిర్యాదుదారులు సత్వర న్యాయం జరిగేందుకు ఇది ఉపయోగపడుతుంది. MEA, GAD (TS), RPO, NGOలు, విదేశీ దేశాల కాన్సులేట్లు మరియు నిపుణుల ప్యానెల్ వంటి స్టేక్-హోల్డర్స్ కోసం సమన్వయ వేదికను ఏర్పాటు చేయడం ద్వారా నిందితులను బయటి దేశాల నుండి భారతదేశానికి తీసుకురావడం సులభతరంగా మారింది.

NRI సెల్ యొక్క కూర్పు

డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో NRI సెల్ నడుస్తుంది, ఇందులో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ మరియు ఇద్దరు పోలీస్ కాన్స్టేబుల్స్ కూడా ఉంటారు.

NRI సెల్ ఎలా పని చేస్తుంది?

నమోదైన కేసుల వివరాలు సేకరణ

రాష్ట్రవ్యాప్తంగా NRI భాగస్వాములు/బంధువుల వల్ల జరిగే వేధింపులకు సంబంధించి నమోదైన కేసుల వివరాలు సేకరించడం జరుగుతుంది. ఫిర్యాదు చేయడానికి నేరుగా కార్యాలయానికి వచ్చిన వారి నుండి కూడా పిటిషన్లు స్వీకరించడం జరుగుతుంది.

కేసు వివరాలు మరియు స్థితి

పిటిషన్ అందుకున్నాక, NRI సెల్, కేసుకు సంబంధించిన వివరాలను మరియు స్థితిగతులను ఫిర్యాదుదారు నుండి మరియు కేసు విచారణ చేస్తున్న అధికారి నుంచి ఫోన్ ద్వారా సేకరిస్తుంది.

సమీక్ష

అధికారుల ఆదేశాల ప్రకారం విచారణ జరిపే అధికారులు కేసుకు సంబంధించిన సమీక్ష కొరకు కార్యాలయానికి వచ్చి నిపుణుల ప్యానెల్ ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది.

విచారణలోని లోపాలను సరిచేయుట

సమీక్ష పూర్తయిన తర్వాత విచారణ అధికారులకు విచారణలో ఉన్న లోపాలు ఏమిటో తెలుపుతూ వాటిని సరిచేయమని మార్గదర్శకాలు వెళ్తాయి.

వాటాదారులు

NRI సెల్ సమర్థవంతమైన పనితీరు కోసం NCW, MEA, MHA, GAD TS మరియు RPO వంటి స్టేక్-హోల్డర్స్ తో అనుసంధానం అయ్యి ఉన్నది.

ఫాలో అప్

రాష్ట్రవ్యాప్తంగా NRI నిందితుల మీద పెట్టిన కేసులు అన్నిటిని ఫాలో అప్ చేసి LOC లను మరియు NBW ల స్థితిని పర్యవేక్షించడం జరుగుతుంది. దీనివల్ల బాధితులు NRI భాగస్వామి/బంధువుల వల్ల ఏ విధంగా బాధపడుతున్నారో, కేసులు ఎలా పెడుతున్నారో, దీనికి శాశ్వత పరిష్కారాలు ఏమైనా ఉంటాయా అనే విధంగా విశ్లేషణ జరుగుతుంది.

NRI సెల్ ఏమి చేయగలదు?

NRI వివాహం - చేయదగినవి మరియు చేయకూడనివి

  • పెళ్లికి త్వరపడొద్దు.
  • వివాహాన్ని గూర్చి అందరికీ చెప్పండి
  • పెళ్లి కొడుకు/పెళ్లి కూతురుకు సంభందించి, కుటుంబం గురించి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోండి.
  • పెళ్లిళ్ల బ్రోకర్లు/బ్యూరోల సమాచారంపై ఆధారపడవద్దు
  • వివాహాన్ని రిజిస్టర్ చేయించుకోండి.
  • విదేశాలలో చట్టపరమైన హక్కులు, అర్హతలు మరియు అత్యవసర సేవల గూర్చిన అవగాహన పొందండి.
  • పెళ్లి కొడుకు/పెళ్లి కూతురు, స్నేహితులు/కుటుంబ సభ్యుల ముఖ్యమైన పాత్రల కాపీలను మీ దగ్గర ఉంచుకోండి. ఉదా: వీసా, పాస్-పోర్ట్.

NRI సంబంధాలు చూసేటప్పుడు అబ్బాయి యొక్క వైవాహిక స్థితి మరియు పౌరసత్వ స్థితి గురించి తెలుసుకోవడం అత్యంత అవసరం. మీ భర్త యొక్క పౌరసత్వ స్థితి అతనికి వ్యతిరేకంగా ఉన్న చట్టాలను నిర్ణయిస్తుంది.

భర్త, అత్తయ్య, మామయ్యలను నిందితులుగా చేరుస్తున్నప్పుడు మ్యారేజ్ బ్యూరో ఏజెంట్ ఎవరైతే తప్పుడు సమాచారం అందించారో అతని/ఆమె మీద కూడా ఫిర్యాదు వేసి నిందితుల జాబితాలో చేర్చవచ్చు.

క్రింది సందర్భాలలో కేసు పెట్టవచ్చు

తరచుగా అడిగే ప్రశ్నలు

The court can issue Warrants and also declare your husband a Proclaimed offender.
వారెంట్ జారీ చేయుట
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్‌లు 70-79 క్రిమినల్ కోర్టు వారెంట్‌ల జారీకి సంబంధించినవి. నిందితులు సమన్‌లకు కట్టుబడి ఉండరని కోర్టు భావిస్తే వారికి సమన్‌లకు బదులుగా కోర్టు ద్వారా వారెంట్ కూడా జారీ చేయబడుతుంది.
పరారీలో ఉన్నట్లు ప్రకటించుట
భారతదేశం బయట నివసించే నిందితుడు/భర్తపై వారెంట్ అమలు చేయని పక్షంలో, Cr.PC సెక్షన్ 82 ప్రకారం ప్రచురించిన తేదీ నుండి ముప్పై రోజుల కంటే తక్కువ కాకుండా ఒక నిర్దిష్ట స్థలంలో మరియు నిర్దిష్ట సమయంలో హాజరు కావాలని వ్రాతపూర్వక ప్రకటనను ప్రచురించడానికి కోర్టుకు అధికారం ఉంటుంది. క్రిమినల్ కోర్ట్ ఆదేశాల మేరకు కేసుకు సంబంధించి అవసరం అనుకుంటే నిందితుని చరాస్తి, స్థిరాస్తి వివరాలను కూడా జత చేయవలసి రావొచ్చు.

శ్రీమతి నీరజ సరప్ Vs శ్రీ జయంత్ సరప్ కేసు విషయంలో, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం మహిళల ప్రయోజనాలను పరిరక్షించే చట్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. గౌరవ సుప్రీమ్ కోర్టు మూడు నిర్దిష్ట నిబంధనలను సూచించింది: 
భారతదేశంలో జరిగిన NRI మరియు భారతీయ మహిళ మధ్య వివాహాన్ని విదేశీ కోర్టు రద్దు చేయడానికి వీలు లేదు.
భారతదేశం మరియు విదేశాలలో భర్త ఆస్తిలో భార్యకు తగిన భరణం ఇవ్వాలి.
సివిల్ ప్రొసీజర్ కోడ్ యొక్క సెక్షన్ 44A లాంటి రెసిప్రొకల్ ఒప్పందాలు మరియు కామిటి ప్రిన్సిపల్ ప్రకారం భారతదేశ న్యాయస్థానాలు విడుదల చేసిన డిక్రీనే విదేశీ న్యాయస్థానాలలో కూడా అమలు పరచవచ్చు. ఇది న్యాయస్థానం ఆమోదించిన డిక్రీ అయినందున విదేశాలలో కూడా ఈ డిక్రీని అమలు చేయగలదు.

సెక్షన్ 91 Cr.P.C ద్వారా నోటీసు అందించడం ద్వారా బాధితులను సరైన డాక్యుమెంటరీ ఆధారాలు చూపమని ఆడగవచ్చు. వివాహ నమోదు పత్రం, శుభలేఖలు, పెళ్లి ఫోటోలు, ఆస్తి బదిలీ చేయబడితే విక్రయ పత్రాలు, పాసుపోర్టు & వీసా యొక్క స్థితి, ప్రయాణ పత్రాలు, యజమాని యొక్క వివరాలు మరియు విదేశాలలో మరియు భారతదేశంలోని నిందితుని చిరునామాలు వంటివి చూపాల్సి రావొచ్చు. ఈ ఆధారాల ద్వారా విచారణ సజావుగా మరియు వేగవంతంగా పూర్తవుతుంది.

నిందితుని యొక్క పాస్‌పోర్ట్/వీసా పునరుద్ధరణ సమీప భవిష్యత్తులో ఉంటే, ఆ పాస్‌పోర్ట్/వీసా పునరుద్ధరణను నిలిపివేయమనే అభ్యర్థనతో RPO, సికింద్రాబాద్ కు లేఖ పంపవచ్చు.
నిందితుడి పాస్‌పోర్ట్ ను రద్దు చేయడానికి చర్యలు తీసుకోవాలని అభ్యర్థనతో కేసు వాస్తవాలను వివరిస్తూ NRI సెల్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, న్యూ ఢిల్లీకి లేఖ పంపవచ్చు. వీరు పిటిషన్ ను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటారు.
నిందితడు భారతదేశానికి రావడం-వెళ్లడం గురించి తెలుసుకోవడానికి FRRO, శంషాబాద్‌కు లేఖ పంపవచ్చు.

  • విచారణ అధికారి/బాధితురాలు FIR కాపీని మరియు NBW కాపీని జతచేసి పాస్‌పోర్ట్ ను స్వాధీనం చేసుకోవాలనే/నిలిపివేయాలనే అభ్యర్థనతో పాస్‌పోర్ట్ అధికారికి లేఖ పంపవచ్చు. 
  • విచారణ అధికారి/బాధితురాలు పాస్‌పోర్ట్ ను రద్దు చేయాలనే అభ్యర్థనతో NRI డివిజన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్‌ కి లేఖ పంపవచ్చు.
  • పైన పేర్కొన్న ముఖ్యమైన కార్యాలయాల ఈ-మెయిల్ అడ్రస్లు: నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, న్యూ ఢిల్లీ - ncw@nic.in & dsnri@mea.gov.in రీజినల్ పాస్-పోర్ట్ ఆఫీసర్, సికింద్రాబాద్ - rpo.hyderabad@mea.gov.in

గృహహింస జరిగిందని లేదా జరుగుతోందని లేదా పాల్పడే అవకాశం ఉందని ఏ వ్యక్తి అయినా నమ్మితే వారు రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన రక్షణ అధికారికి సమాచారాన్ని అందించవచ్చు. జిల్లా రక్షణ అధికారి సంఘటన యొక్క నివేదికను తయారు చేస్తారు. ఒకవేళ బాధితురాలు కోరుకుంటే, ఆమె ఉపశమనం కోసం ఈ నివేదికలోనే రక్షణ ఉత్తర్వును కూడా జతపరుస్తూ మేజిస్ట్రేట్‌కు పంపడం జరుగుతుంది. బాధితురాలు లేదా రక్షణ అధికారి లేదా బాధితురాలి తరపు వారు ఎవరైనా ఉపశమనం పొందేందుకు గృహ హింస చట్టం U/s 12 కింద దరఖాస్తు ఇవ్వవచ్చు. జిల్లా రక్షణ అధికారికి బాధితురాలు ఇచ్చిన దరఖాస్తు మరియు రక్షణ అధికారి తయారు చేసిన నివేదిక కూడా మేజిస్ట్రేట్ కు ఇవ్వడం జరుగుతుంది.

నివాస దేశంలో బ్యాంకు ఖాతాను తెరవడానికి ప్రయత్నించండి, తద్వారా మీరు అత్యవసర పరిస్థితుల్లో డబ్బును తీసుకోవచ్చు మరియు ఆర్థిక స్వతంత్రం కూడా ఉంటుంది. విదేశీ దేశంలోని చట్టాలను మరియు అక్కడ మీ హక్కులను చదివి అర్థం చేసుకోండి. ప్రత్యేకించి భాగస్వామి పట్టించుకోనప్పుడు, దుర్భాషలాడుతున్నప్పుడు, గృహ హింసకు పాల్పడుతున్నప్పుడు చట్టాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం మంచిది. ముఖ్యంగా విదేశాలలో శాశ్వత నివాసం ఎలా ఏర్పరుచుకోవాలో తెలుసుకోవడం అవసరం. పెళ్లి అయిన తర్వాత కూడా విదేశాలలో ఉన్న స్నేహితులు, బంధువులతో ఫోన్ & ఈ-మెయిల్ ద్వారా మాట్లాడుతూ ఉండండి. పెళ్లి అయిన తర్వాత ఏ దేశానికి అయితే వెళ్తున్నారో ఆ దేశంలో మాట్లాడే భాషను నేర్చుకోవడానికి ప్రయత్నించండి.

శ్రీమతి నీరజ సరప్ Vs శ్రీ జయంత్ సరప్ కేసు విషయంలో (1994), భారతదేశ అత్యున్నత న్యాయస్థానం మహిళల ప్రయోజనాలను పరిరక్షించే చట్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. గౌరవ సుప్రీమ్ కోర్టు మూడు నిర్దిష్ట నిబంధనలను సూచించింది:
భారతదేశంలో జరిగిన NRI మరియు భారతీయ మహిళ మధ్య వివాహాన్ని విదేశీ కోర్టు రద్దు చేయడానికి వీలు లేదు.
భారతదేశం మరియు విదేశాలలో భర్త ఆస్తిలో భార్యకు తగిన భరణం ఇవ్వాలి.
సివిల్ ప్రొసీజర్ కోడ్ యొక్క సెక్షన్ 44A లాంటి రెసిప్రొకల్ ఒప్పందాలు మరియు కామిటి ప్రిన్సిపల్ ప్రకారం భారతదేశ న్యాయస్థానాలు విడుదల చేసిన డిక్రీనే విదేశీ న్యాయస్థానాలలో కూడా అమలు పరచవచ్చు. ఇది న్యాయస్థానం ఆమోదించిన డిక్రీ అయినందున విదేశాలలో కూడా ఈ డిక్రీని అమలు చేయగలదు.

ముందుగా మీరు భారతదేశంలో మరియు విదేశాలలో ఉన్న మీ కుటుంబసభ్యులు, బంధువులు మరియు స్నేహితులను సంప్రదించండి. వారి ద్వారా సహాయం మరియు సలహాలు పొందే ప్రయత్నం చేయండి. ఇండియన్ మిషన్ వారిచే ఎంప్యానెల్ చేయబడిన NGOలు, స్థానిక కమ్యూనిటీ సంక్షేమ సంఘాల ద్వారా కేసులు పెట్టడం, కుటుంబంతో మాట్లాడడం లేదా చట్టపరమైన సలహాలు పొందడం వంటివి చేయొచ్చు. భారత హై కమిషన్/విదేశాలలో ఉండే కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ద్వారా ఎంప్యానెల్ చేయబడిన NGOల జాబితా ఈ లింక్ ద్వారా పొందవచ్చు - http://moia.gov.in/writereaddata/pdf/list_indian_women.pdfసహాయం కొరకు వారిని ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చు.

IPC లేదా ఇతర శిక్షా చట్టాల ప్రకారం గుర్తించదగిన నేరాలలో దర్యాప్తు ఏజెన్సీ ద్వారా జారీ చేయవలసిన లుక్-అవుట్-సర్క్యులర్ (LOC)ను ఆశ్రయించవచ్చు. విదేశాలలో భర్త ఉద్దేశపూర్వకంగా ఖైదు అవ్వకుండా తప్పించుకుంటున్నప్పుడు లేదా నాన్-బెయిలబుల్ వారెంట్ (NBWs) ఉన్నా కూడా ట్రయిల్ కోర్టు ఎదుట హాజరు కానప్పుడు లేదా ట్రయిల్/ఖైదు నుండి తప్పించుకోడానికి దేశం వదిలి పారిపోతాడు అని అనిపించినప్పుడు లుక్-అవుట్-సర్క్యులర్ తెచ్చుకోవడం ఉపయోగకరం. 

సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి