SHE మాడ్యూల్ యొక్క ప్రధాన లక్ష్యం మహిళలు మరియు పిల్లల పట్ల జరిగే నేరాలను ఎదుర్కోవడం. ప్రత్యేకించి ఈవ్ టీసింగ్, స్టాకింగ్, బహిరంగ ప్రదేశాలలో, పని వద్ద, విద్యాసంస్థల్లో & గృహ సౌధాలలో మహిళలు మరియు పిల్లల పట్ల వేధింపులు వంటివి తగ్గించడానికి SHE మాడ్యూల్ ప్రయత్నిస్తుంది. SHE మాడ్యూల్ దీన్ని SHE టీమ్స్ ద్వారా వాస్తవ మరియు వర్చువల్ ప్రపంచంలో సాధిస్తుంది.
సృష్టించడం, పోషించడం మరియు మార్పును తీసుకురావడం వంటి ఎన్నో సద్గుణాలు గల స్త్రీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాగరికతలు, సమాజాలు, కుటుంబాలు మగవారితో సమానంగా వీరిని చూడలేకపోవడం దురదృష్టకరం. పక్షపాత ధోరణి, దురభిమానము మరియు అహంకారపూరితమైన దృష్టి వల్ల లింగ బేధం చూపడం మరియు మహిళల పట్ల హింసాత్మక ప్రవర్తన సమాజంలో గమనించవచ్చు, దీని వల్ల మహిళలు తమ పూర్తి సామర్ధ్యంతో పని చేయలేకపోతున్నారు అనేది వాస్తవం. స్త్రీలు ఉన్నది కేవలం మగవారి అవసరాలు తీర్చడానికే అనే విధంగా ఆలోచనలు పెరుగుతున్నాయి. సినిమాలలో హీరోలు చేసే వెకిలి చేష్టలు, అమ్మాయిలను ఏడిపించే విధానం, మగవాడే ఎక్కువ అని చూపడం సమాజంలో ఒకరకమైన అసమానత్వాన్ని ఏర్పరిచింది.
ఇవే చేష్టలు కాస్త తీవ్ర రూపం దాల్చి గృహ హింస, లైంగిక వేధింపులు, ఈవ్ టీసింగ్ వంటివి పెరిగిపోయాయి. బహిరంగ ప్రదేశాలలో అమ్మాయిల పట్ల దురుసుగా ప్రవర్తించుట, చెడు మాటలాడుట వంటివి ఈవ్ టీసింగ్ లో భాగం అయిపోయాయి. Indian sub-continent to denote unwanted sexual remarks or advances to women in public places.
వక్రబుద్ధితో చూడడం, కూతలు కూయడం, లైంగిక పరమైన మాటలు మాట్లడడం, స్టాకింగ్, ఇబ్బందికర పాటలు పాడడం మరియు ఫ్లాషింగ్, తడమడం & అత్యాచారం వంటి అసభ్యకరమైన వీడియోలు చూపుట వంటివి "సెక్సువల్ అగ్రెషన్" కింద వస్తాయి. ఈ నేరాలకు పాల్పడేవారు బహిరంగ ప్రదేశాల్లో, కళాశాలలు మరియు కార్యాలయాల సమీపంలో మరియు ఇళ్ల వెలుపల మహిళలను వేధించడానికి తెలివిగల మార్గాలను ఎన్నుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పీడ లేకుండా మహిళలకు భద్రతాభావాన్ని కలగజేయడానికి మరియు సురక్షిత వాతావరణాన్ని సృష్టించడానికి ముందుకు తీసుకువచ్చిందే SHE టీమ్స్.
జిల్లాలు / కమిషనరేట్‌లలో పని చేసే షీ టీమ్‌ల కోసం యూనిట్ వారీగా షీ టీమ్ డేటాను అప్‌డేట్ చేయడానికి మరియు స్టోర్ చేయడానికి ప్రత్యేకంగా షీ టీమ్స్ సాఫ్ట్‌వేర్ రూపొందించబడింది - వారి రోజువారీ పనితీరు మరియు ఫిర్యాదులు.
క్యుఆర్ కోడ్ విధానం తెలుగు/ఇంగ్లీష్/ఉర్దూ భాషల్లో అమల్లోకి వచ్చింది మరియు రాష్ట్రంలోని ప్రతి బహిరంగ ప్రదేశంలో బార్‌కోడ్‌లు ఉంచబడ్డాయి. బాధితురాలు బార్‌కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది, ఇది పిటిషనర్‌కు ఎక్కడి నుండైనా జిల్లా షీ టీమ్‌కి ఫిర్యాదు చేయడంలో సహాయపడుతుంది.
షీ టీమ్ వాట్సాప్ నంబర్ అనేది నాన్ ఎమర్జెన్సీ నంబర్, ఇక్కడ బాధితురాలు రాష్ట్రంలో ఎక్కడి నుండైనా తమకు ఎదురయ్యే వేధింపులను రిపోర్ట్ చేయవచ్చు.
కోవిడ్ -19 నుండి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సౌకర్యం అమలులో ఉంది. షీ టీమ్స్ ద్వారా ఒక సెషన్ లో, 12 మంది కౌన్సెలర్ల ప్రత్యేక బృందంతో అపరాధులందరికీ ప్రతి నెలా ఈ ఫెసిలిటీ అమలు చేయబడుతోంది.