మహిళలు మరియు పిల్లల పట్ల జరిగే సైబర్ నేరాలపై దృష్టి సారించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం సైబర్ మాడ్యూల్. ఈ మాడ్యూల్ ఫిర్యాదులను సమీక్షించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న సంబంధిత అధికారులకు సహాయం అందించడం, స్టేటస్ లను సరిచూడడం, నిర్ణయం తీసుకునేందుకు వీలుగా సమాచారాన్ని విశ్లేషణ చేసి చర్యలు తీసుకోవడం మరియు నిర్దిష్ట పద్ధతులను (SOP) పాటించేలా చేయడం వంటివాటికి తోడ్పడుతుంది. సైబర్ మాడ్యూల్ దర్యాప్తు ప్రక్రియ నాణ్యతను మెరుగుపరచడంలో ప్రత్యక్ష, సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.