
కు స్వాగతం
అవగాహన కలిగిన పౌరులే, సాధికారత కలిగిన పౌరులు
"ప్రత్యేకరాష్ట్రం ఏర్పడ్డప్పట్టి నుండి తెలంగాణ పోలీసులకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి స్త్రీలకు సురక్షితమైన వాతావరణం కలిపించాలి అనేది ఒక ముఖ్యమైన అంశంగా మారింది. దీని కోసం SHE టీమ్స్, భరోసా కేంద్రాలు వంటివి తెలంగాణ పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. వీటి లక్ష్యం ఈవ్-టీసింగ్ అరికట్టడం, మహిళకు రక్షణ కల్పించడం మరియు స్త్రీలు స్వతంత్రంగా పని చేసుకునేందుకు వీలైన వాతావరణాన్ని సృష్టించడం. సమాజంలో నేరాలను తగ్గించి మరియు రక్షిత కార్యక్రమాలను పెంచి సమాజం యొక్క అవసరాలను తీర్చడమే లక్ష్యంగా మేము పని చేస్తున్నాము."
"సమస్యకు తగ్గ పరిష్కారాన్ని సూచిస్తూ మహిళలు మరియు పిల్లలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు మహిళా సంరక్షణ విభాగం కట్టుబడి ఉంటుంది. SHE భరోసా సైబర్ ల్యాబ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, NRI సెల్, తప్పిపోయిన వ్యక్తుల పర్యవేక్షణ సెల్ మొదలైనవి ఈ విభాగంలో పని చేస్తున్నాయి. SHE టీమ్స్ మరియు AHT యూనిట్లకు నోడల్ ఏజెన్సీగా ఈ విభాగం అన్ని జిల్లాల్లో పనిచేస్తుంది. అంతేకాదు భరోసా కేంద్రాల కార్యకలాపాలని కూడా చూసుకుంటుంది."
"స్త్రీలు బలహీనమైన లింగానికి చెందిన వారు కాదు. వారు మరొక లింగం, అంతే. మీరు కొన్ని పనులు చేయలేరు లేదా దుర్బలమైన వారు అని మీ మెదడుని శక్తిహీనంగా మార్చుకోవద్దు. ఇప్పుడు స్త్రీలపట్ల నేరాలను ఆపేందుకు ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి, SHE టీమ్స్ ఏర్పాటును కూడా చేసాము. మహిళలు మరియు పిల్లలపై జరిగిన అన్యాయాలను ఎదుర్కొనేందుకు, స్త్రీ సంరక్షణా విభాగం మహిళల, పిల్లల హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే ప్రత్యేక మాడ్యూళ్లను అభివృద్ధి చేసింది. అంతే కాకుండా ఈ విభాగం ఎన్నోఅవగాహనా కార్యక్రమాలతో ముందుకెళ్తోంది."
జ్ఞానమే నిజమైన శక్తి