షీ టీమ్స్

మహిళా భద్రతకు మార్గదర్శకులుగా నిలవడం

స్నేహపూర్వకమైన పోలీసింగ్ అందించాలి అనే పెద్ద లక్ష్యంతో, మహిళలకు పూర్తిగా సురక్షితమైన మరియు భద్రమైన వాతావరణాన్ని అందించాలనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 'SHE టీమ్స్'ను 2014 అక్టోబర్ 24న హైదరాబాద్ నగరంలో ప్రారంభించింది. హైదరాబాద్ నగరంలో SHE టీమ్స్ మంచి ఫలితాలు రాబట్టడంతో ఏప్రిల్ 2015 నుండి ఈ బృందాలను సైబరాబాద్, ఆ తర్వాత తెలంగాణలోని అన్ని జిల్లాలకు విస్తరింపజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని SHE టీమ్స్ యొక్క పనితీరును స్త్రీ సంరక్షణ విభాగం పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతానికి రాష్ట్రమంతటా 331 SHE టీమ్స్ ప్రజలకి సేవలందిస్తున్నాయి.

మేము సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాము

మమ్మల్ని చేరుకోండి

షీ టీమ్‌లను నేను ఎప్పుడు సంప్రదించవచ్చు?

షీ టీమ్స్ గురించి

ఈ క్రింది వాటి ద్వారా మహిళలు మరియు పిల్లలకు భద్రత మరియు రక్షణ కల్పించాలనే దృక్పథంతో SHE టీమ్స్ ను ఏర్పాటు చేశారు:

మా పనితీరు ఎలా ఉంటుంది?

SHE టీం ముఖ్యాంశాలు

స్థాపన
2010
రాష్ట్రంలో షీ టీమ్స్ సంఖ్య
300 +

మహిళల భద్రత కోసం సాంకేతికత & విశ్లేషణలను పెంచడం

షీ టీమ్స్ సాఫ్ట్‌వేర్

పర్యవేక్షణ అధికారుల నుండి క్షేత్ర స్థాయి అధికారుల వరకు అంటే SHE టీమ్ ఇంచార్జ్ ACPs/SDPOs, SIలు మరియు అడ్మిన్‌ల వరకు అందరికి యూజర్ ఐడిలు అందించబడతాయి. ఎవరి నుండైనా పిటిషన్ రాగానే దాన్ని సంబంధిత ACPs/SDPOs SHE టీం సాఫ్ట్-వేర్ కు అప్‌లోడ్ చేస్తారు. ఆ తర్వాత ఈ పిటిషన్ పై SIs/ASIs/HCs విచారణ జరిపి నివేదికను తయారు చేస్తారు. దీన్ని మరల SHE టీమ్ సాఫ్ట్-వేర్ లో పొందుపరుస్తారు.

అధికారులచే వివిధ రంగాల/మూలాలు ద్వారా సంగ్రహించబడిన సమాచారం ఆధారంగా వివరణాత్మక డాష్‌బోర్డ్‌లు మరియు నివేదికలు రూపొందించబడతాయి. పిటిషన్లు, పరిశీలనలు, ప్రచారాలు, పిటిషనర్ / అనుమానిత వివరాలు, పిటిషనర్ / అనుమానితుడి వృత్తి, పిటిషన్ యొక్క స్వభావం మొదలైనవి డాష్‌బోర్డ్‌లు చేయడానికి ఉపయోగపడొచ్చు. పిటిషన్‌ల యొక్క స్థితిని బట్టి కూడా నివేదికలు రూపొందించవచ్చు.

హాట్‌-స్పాట్‌లు, రెడ్ హ్యాండెడ్ కేసులు, FIRలు మరియు చిన్న కేసులు నమోదు చేయడం, నిర్వహించబడిన కౌన్సెలింగ్ సెషన్‌లు, హెచ్చరికలు/ లెట్ ఆఫ్ మరియు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలపై సమాచారాన్ని SHE టీమ్స్ రోజువారీ DSR నివేదికలో పొందుపరుస్తుంది.