మహిళలు మరియు పిల్లల భద్రతను మెరుగుపరిచేందుకు స్త్రీ సంరక్షణ విభాగం ఎన్నో ఉపయోగకరమైన యాప్‌లను విడుదల చేసింది. నేర నియంత్రణ మరియు నేరాలను అరికట్టడమే కాకుండా అందరికి యాప్‌ల ద్వారా వివిధ స్థాయిల్లో అవగాహన అందించడం కూడా చేయడం జరుగుతుంది. తెలంగాణ పోలీసు శాఖ వారి చొరవతో TS cop అప్లికేషన్ ద్వారా పూర్తి సాంకేతికతను అనుసంధానం చేయడం ద్వారా అనేక కీలక అంశాలపై తెలంగాణ పోలీసులు 360-డిగ్రీల దృష్టి కోణాన్ని సాధించగలిగారు.
LMS ప్రారంభించడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ సంరక్షణ విభాగం సాంకేతికతను ఉపయోగించుకుని మహిళలు మరియు పిల్లల భదత్రను గూర్చి విలువైన సమాచారాన్ని అందించగలుగుతున్నారు. తెలంగాణలో మూలమూలలో ఉన్న వారికి మహిళల, పిల్లల భద్రత గురించి చెప్తూ పట్టణ మరియు గ్రామీణ పిల్లల మధ్య ఉండే దూరాన్ని తగ్గించి ఓ వారధిలా ఉండడమే LMS యొక్క లక్ష్యం.
A groundbreaking initiative by the Women Safety Wing that revolutionizes the landscape of safety and security. With a core focus on digital inclusivity, T-Safe expands the role of law enforcement from emergency response to continuous ride monitoring, ensuring citizens’ safety at every step. Through automated ride monitoring with minimal human intervention and a streamlined information capture process, T-Safe requires only basic digital literacy from citizens while overlaying seamlessly on existing mechanisms.
స్త్రీ సంరక్షణ విభాగం, తెలంగాణ యొక్క వివిధ మాడ్యూల్లకు విశ్లేషణా మాడ్యూల్ సహాయ సహకారాలు అందిస్తుంది. స్త్రీలు మరియు చిన్నపిల్లలకు సంబంధించిన ఫిర్యాదులను పర్యవేక్షించి వారి పట్ల నేరాలు జరగకుండా ప్రయత్నిస్తుంది. POCSO చట్టం కింద నమోదైన కేసులలో నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (సెక్సువల్ ఆఫీసెస్ మాడ్యూల్) కు ఈ మాడ్యూల్ సహాయం చేస్తుంది. సైబర్ క్రైమ్ మరియు మనుష్యుల అక్రమ రవాణా కేసులలో బాధితులను గుర్తించడం (కనపడకుండాపోయిన/కిడ్నాప్ అయిన వ్యక్తి), అనుమానితులను/ప్రతివాదులను/నిందితులను పట్టుకోవడం వంటి వాటిలో విచారణలో భాగమైన మాడ్యూల్-అధికారులకు ఈ విభాగం సహాయం అందిస్తుంది.