తెలంగాణ రాష్ట్ర పోలీసుల శాఖ వారి స్త్రీ సంరక్షణ విభాగం రాష్ట్రంలో ఉన్న మహిళల యొక్క భద్రత, గౌరవం మరియు సాధికారతను కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. ఈ విభాగం మహిళల పట్ల జరిగే నేరాలను విచారించేందుకు స్థాపించారు. ఇందులో ముఖ్యంగా స్త్రీల అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, గృహ హింస, పిల్లలపై వేధింపులు, నేరాలు, NRI సమస్యలు మరియు సైబర్ నేరాల గురించి ప్రత్యేకముగా దృష్టి పెట్టడం జరుగుతుంది. సమస్యకు తగ్గ పరిష్కారంతో ముందుకు వెళ్తూ TSWSW పూర్తి శ్రద్ధతో మహిళలు మరియు పిల్లల పరిరక్షణకు కృషి చేస్తోంది.
ఉమెన్ సేఫ్టీ వింగ్ (WSW) అనేది ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, CID నుండి రూపొందించబడింది. ఇది అన్ని రకములైన సౌకర్యాలతో, క్రియాత్మకమైన మరియు అన్నివేళలా సన్నద్ధంగా ఉండే స్వతంత్ర విభాగం. స్త్రీ సంరక్షణ విభాగానికి సొంత అధికారులు, సభ్యులు ఉంటారు మరియు నిర్దిష్టమైన నియమాలను పాటించడం జరుగుతుంది.
భాగస్వాములు స్వావలంబనతో ఉండేలా మద్దతు ఇవ్వడం మరియు వారి జీవన ప్రయాణంలో అభివృద్ధి సోపానాలు సహాయం చేయడం మా లక్ష్యం. సంఘర్షణలను తగ్గించడం, అవసరమైన సహాయాన్ని అందించడం, లావాదేవీల నేరాలు & ఇతర భద్రతాపరమైన సమస్యలను నివారించడం ద్వారా ఈ లక్ష్యాలను చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాము. నైపుణ్య శిక్షణ మరియు ఇతర సహాయక వ్యవస్థల ద్వారా మహిళల శ్రేయస్సును మేము ప్రోత్సహిస్తున్నాము.
మహిళలు కూడా పురోగతిలో భాగస్వాములుగా ఉండేలా "లింగసమానమైన" రాష్ట్రాన్ని తయారు చేయడమే మా విజన్. ప్రాంతీయం మరియు జాతీయ సంకీర్ణ సంస్థలతో కలిసి పనిచేయడం వల్ల TSWSW లింగ భేదం లేనటువంటి, సమానమైన అవకాశాలు ఉండేటటువంటి పని వాతావరణాన్ని సృష్టించేందుకు అడుగులు వేస్తున్నాము.
The Safe City Project is a Central Government Scheme funded by the Nirbhaya Fund. This fund has been released to 8 largest cities in the country (Chennai, Bangalore, Hyderabad, Mumbai, Ahmedabad, Lucknow, Kolkata & Delhi) as per project proposals submitted by the respective cities. In the State of Telangana, the Tri-Commissionerate area (including GHMC and part of HMDA regions) is covered under the project. The Safe City Project also partners with GHMC & Transport Department in implementing the project.
సేఫ్ సిటీ-హైదరాబాద్ యొక్క ముఖ్య భాగాలు