ఆధునికతతో పెరుగుతున్న సైబర్ నేరాలను నివారించేందుకు తెలంగాణ రాష్ర పోలీస్ మరియు స్త్రీ సంరక్షణ విభాగం ముందుకు తెచ్చిన రక్షణ కవచమే CybHER. ఇందులో భాగంగా సంఘంతో సానుకూల సంబంధాలను కొనసాగింపు మరియు నేర నియంత్రణ & నేరాల నివారణలో సమాజాన్ని భాగస్వాములుగా చేయడం జరుగుతుంది. స్త్రీ సంరక్షణ శాఖ సైబర్ భద్రతకు సంబంధించి సమాజంలోని అత్యంత ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. CybHER తెలంగాణ రాష్ట్రంలో e-కమ్యూనిటీ పోలీసింగ్ వైపు కొత్త వెలుగులు ప్రసరింపజేస్తోంది.
సైబర్ ప్రపంచంలో మహిళలు మరియు పిల్లలకు సురక్షితమైన ప్రదేశాన్ని సృష్టించడానికి స్త్రీ సంరక్షణ విభాగం ఒక విన్నూత్నమైన కార్యక్రమం చేపట్టింది. ఇది స్వయానా శ్రీ మహేందర్ రెడ్డి - DGP, శ్రీమతి స్వాతి లక్రా - అదనపు DGP మరియు శ్రీమతి సుమతి బడుగుల - డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గార్ల నేతృత్వంలో రూపొందించబడింది. డిజిటల్ ప్రపంచంలో తమను తాము సురక్షితంగా ఉంచుకోవడం మరియు ఎవరితో ఎలా వ్యవహరించాలనే దానిపై మహిళలు మరియు పిల్లలకు అవగాహన కల్పించడం, సరైన సహాయాన్ని అందించడం మరియు సైబర్ స్పేస్ లో స్వేచ్ఛను అందించడం ఈ ప్రచారం యొక్క లక్ష్యం.