మహిళలు మరియు పిల్లలపై సాధారణంగా జరుగుతున్న మరియు కొత్తగా పెరుగుతున్న సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర పోలీసు వారి స్త్రీ సంరక్షణ విభాగం SHE భరోసా సైబర్ ల్యాబ్ ను నెలకొల్పింది. సైబర్ పెట్రోలింగ్ మరియు ప్రొఫైలింగ్ పద్ధతులను అమలు చేయడం ద్వారా మహిళలు మరియు పిల్లలపై సైబర్ నేరాల నివారణ, గుర్తింపు, పరిశోధన మరియు పర్యవేక్షణలో ఈ ల్యాబ్ ఉపయోగించబడుతుంది. మహిళలు మరియు పిల్లలపై జరిగే సైబర్ నేరాలను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి SHE భరోసా సైబర్ ల్యాబ్ రాష్ట్రానికి నోడల్ ల్యాబ్ గా పనిచేస్తుంది; అంతేకాకుండా SHE టీమ్స్, భరోసా, AHTU, జిల్లా సైబర్ విభాగం మరియు COE లకు సాంకేతిక తోడ్పాటును అందిస్తుంది.
SHE-భరోసా సైబర్ ల్యాబ్ వివిధ నేర మూలాలు మరియు ఇండికేటర్లను గుర్తించడానికి మరియు నేరాలను ఎదుర్కోవడానికి వ్యూహాలను అభివృద్ధి చేయడానికి రూపొందించబడింది. ఈ నేరాలను ఎదుర్కొనేందుకు ల్యాబ్ లో సంఘటనలకు ప్రతిస్పందించేందుకు, పరిశోధనలు చేసేందుకు, ఫోరెన్సిక్ సమీక్ష జరిపేందుకు అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయి. సైబర్ సహకారం అందించడం ద్వారా క్షేత్రస్థాయి సమస్యలని త్వరగా పరిష్కరిస్తూ SHE భరోసా సైబర్ ల్యాబ్ అన్ని విభాగాలను బలోపేతం చేస్తుంది.
సైబర్ వారియర్స్ మరియు SHE టీమ్‌లకు సత్వర మద్దతు మరియు పరిష్కారాలను అందించడం కోసం ఫిర్యాదు లేదా కేసు నమోదు చేయబడితే, తెలంగాణ పోలీసు వారి స్త్రీ సంరక్షణ శాఖ వివిధ రకములైన మాడ్యూళ్ల సహాయంతో ఫిర్యాదును పరిశీలించి సమర్థవంతమైన పరిష్కారాన్ని చూపుతుంది.
The lab has forensic tools and capabilities to handle crime scene management. These tools will aid in collecting and preserving the computer evidence, seize mobile devices & external peripherals, collect CCTV footage and analyse Cyber Predator's Network Traffic. This multi-folded approach will help LEAs build effective and fool proof cases against Cyber Harasser/ Predators and traffickers for conviction.
సైబర్ ప్రపంచంలో నేరస్తులు అనోనిమిటి టూల్స్ వాడడం వల్ల విచారణ అధికారులకు నేరస్తులను పట్టుకోవడం పెద్ద సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో SHE-భరోసా సైబర్ ల్యాబ్ స్థాపించడం ద్వారా సైబర్ నేరగాళ్ళను పట్టుకునేందుకు అత్యాధునిక పరికరాలను వాడే వీలు కలుగుతోంది.
స్క్రాపింగ్ మరియు హార్వెస్టింగ్ పద్దతులలో ఆన్లైన్ ఇంటెలిజెన్స్ పెంపొందించుకునేందుకు SHE-భరోసా సైబర్ ల్యాబ్ ఉచితమైన, ఓపెన్ సోర్స్ మరియు కస్టమ్ టూల్స్ ను ఉపయోగించుకుంటుంది. హనీపాట్ మరియు ట్రాప్ పద్ధతుల ద్వారా చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (CSAM) జరగకుండా అన్నివేళలా పర్యవేక్షిస్తూ ఉంటుంది.
అత్యాధునిక సైబర్ ఇంటెలిజెన్స్ మరియు స్క్రాపింగ్ పద్ధతులను వాడడం ద్వారా కార్యాచరణలో పెట్టగల ఇంటెలిజెన్స్ మరియు ఊహాజనిత ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుని అసభ్యంగా ప్రవర్తించేవారు, ప్రెడేటర్స్ మరియు పీడోఫైల్స్ ను అనుమానితులుగా నమోదు చేస్తారు. జిల్లా సైబర్ ల్యాబ్‌ల విచారణ ప్రక్రియలో SHE-భరోసా సైబర్ ల్యాబ్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.