లైంగిక నేరాల మాడ్యూల్ (భరోసా)

ఆదరణకు హస్తం, పోరాడేందుకు పిడికిలి, ఉద్యమించే గళం, ఓదార్చే బృందం

మే 2016న హైదరాబాద్ లో మొట్టమొదటి భరోసా కేంద్రం ఏర్పాటు చేయబడింది. ఇది మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ - తెలంగాణ వారి లాజిస్టిక్ సహాయం, మద్దతు మరియు నిధుల ద్వారా స్త్రీ మరియు శిశు సంరక్షణ శాఖగా ఆవిర్భవించింది. ఆపదలో ఉన్న ఎవరైనా వచ్చి భరోసా కేంద్రం తలుపు తడితే వారికి తక్షణమే ప్రత్యేక సేవలు, పరిష్కారం లభిస్తుంది. అవసరమైన వ్యక్తి/వ్యక్తులకు సైకోతెరపాటిక్ కౌన్సిలింగ్ తోపాటు పోలీసులు, వైద్యులు, లాయర్లు, ప్రాసిక్యూషన్ సేవలు అందింపబడతాయి. ఇన్ని శాఖలు కలయికతో పని చేయడం వల్ల సమస్య నుండి ఉపశమనం కలగడమే కాక అవసరాన్ని బట్టి బాధితులకు పునరావాసం కూడా కల్పించబడుతుంది.

మేము సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాము

మమ్మల్ని చేరుకోండి

భరోసా కేంద్రాన్ని ఎప్పుడు సంప్రదించవచ్చు?

లక్ష్యాలు

భరోసా యొక్క అవసరం

సంవత్సరాలు గడిచేకొద్దీ మన దేశంలో లైంగిక వేధింపుల సంఖ్య అధికం అవుతుంది. చిన్నపిల్లల పట్ల ఇటువంటి నేరాలను అరికట్టేందుకు చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వం POCSO (ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టం, 2012ను ప్రవేశపెట్టింది. అయితే ఇది సరైన రీతిలో అమలు కావడానికి క్షేత్రస్థాయి నుండి మద్దతు అవసరము.

ఓ అధ్యయనం ప్రకారం, ప్రతి సంవత్సరం 3000కు పైగా దుర్ఘటనలు POCSO చట్టం కింద నమోదు అవుతున్నాయి. లైంగికంగా వేధింపులకు గురైన ప్రతి నలుగురు పిల్లలలో కేవలం ఒక్కరికి మాత్రమే న్యాయం జరుగుతుంది. దీనికి కారణం పోలీసులకు సరైన ఆధారాలు దొరక్క కేసులను మూసేయాల్సిరావడం.

KSCF అధ్యయనం ప్రకారం 2017 నుండి 2019 మధ్య కాలంలో నమోదు చేసిన POCSO కేసుల్లో ఇంకా 89% మందికి న్యాయం జరగాల్సి ఉంది. న్యాయస్థానంలో ఈ కేసులను త్వరగా తుదిదశకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. POCSO ద్వారా న్యాయం కోరి వచ్చిన వారికి న్యాయం జరగాలి అంటే వారు న్యాయస్థానంలో కేసును ప్రవేశపెట్టేటప్పుడు సరైన విధంగా ఆధారాలను చూపెట్టాలి, తద్వారా సమర్ధవంతంగా నేరగాళ్ల గుర్తింపు మరియు శిక్షపడటం అనే ప్రక్రియ వేగవంతం అవుతుంది. భరోసా కేంద్రాలు అనేక శాఖలతో పనిచేయడం వల్ల సత్వర ఫలితాలు వచ్చేలా కృషి చేయడమే కాకుండా నేరాలు జరగకుండా అరికట్టేందుకు తోడ్పడుతుంది.

చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులు

పిల్లలకు స్నేహపూర్వకమైన న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం ద్వారా కలిగే లాభాలు:

POSCO చట్టం యొక్క నిర్దేశాలను పాటిస్తూ, తెలంగాణ హై కోర్ట్ నుండి సూచనలు మరియు అనుమతులు తీసుకుని భరోసా శాఖ పిల్లల కోసం ప్రత్యేకమైన చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ ను నెలకొల్పింది. ఈ చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ ఏప్రిల్ 7, 2018న గౌరవనీయులు జస్టిస్ మదన్ బి. లోకుర్, సుప్రీమ్ కోర్ట్ హానరబుల్ జస్టిస్, గారిచే ప్రారంభింపబడినది. 2020న 27 కేసులలో తీర్పు వెల్లడై నేరారోపణలు నిజమని తేలాయి. 2014లో POCSO చట్టం ద్వారా నేరారోపణలు రుజువైన కేసుల శాతం 4% అయితే 2019-2020 గాను అది 30% కు పెరిగింది. స్థిరమైన పని విధానాన్ని అమలు చేయడం ద్వారా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టుల నుండి నేర నిర్ధారణ జరుగుతుంది.

భరోసా యొక్క ముఖ్యాంశాలు

హోలిస్టిక్ కన్వర్జెన్స్ అప్రోచ్

"భరోసా" అనేది హింసకు గురైన మహిళలు & పిల్లల కోసం ఏర్పాటు చేసిన సమీకృత సహాయక కేంద్రం. శారీరిక, లైంగిక, భావ, మానసిక మరియు ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కున్న మహిళలు మరియు చిన్నపిల్లలకు వయసు, స్థాయి, కులం, విద్య, వైవాహిక స్థితి, మతం మరియు నాగరికతలో సంబంధం లేకుండా అన్ని విధాలా మద్దతు, పరిష్కారం మరియు పునరావాసం కల్పించడం 'భరోసా' యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఈ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ, హైదరాబాద్ మరియు వికారాబాద్ లో 2016 మరియు 2018లో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. 2020లో వరంగల్ మరియు సంగారెడ్డి జిల్లాల్లో జూన్ 20, 2020 మరియు సెప్టెంబర్ 29, 2020న భరోసా కేంద్రాలు తెరవబడ్డాయి. నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, ఖమ్మం, ఓల్డ్ సిటీ (హైదరాబాద్), సైబరాబాద్ మరియు రాచకొండ (సేఫ్ సిటీ ప్రాజెక్ట్ క్రింద) ప్రాంతాలలో భరోసా కేంద్రాల పునర్నిర్మాణం లేదా నిర్మాణం జరుగుతున్నది.

స్పెషల్ టాస్క్ ఫోర్స్

గౌరవ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మరియు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం WSWలో ఓ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబడింది. ఈ టాస్క్ ఫోర్స్ POCSO చట్టంలోని UI మరియు PT కేసులలో విచారణ ఏ విధంగా జరుగుతుందో పర్యవేక్షిస్తుంది. టాస్క్ ఫోర్స్ ప్రతి కేసును పరిశీలిస్తూ, రెండు నెలలలోపు విచారణ పూర్తయ్యేలా మరియు రెండు నెలలలో కేసు యొక్క ట్రయల్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటుంది. పర్యవేక్షణ అనేది CCTNS (క్రైం & క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్) సమాచారం ద్వారా జరుగుతుంది మరియు ఇది స్త్రీ సంరక్షణా విభాగం ప్రధాన కార్యాలయంలో ఉంటుంది. CCTNS వేదికను ఉపయోగించుకుంటూ నియంత్రిత సమయానికి లోబడి మరియు సరైన విచారణ పద్దతులను పాటిస్తూ POCSO చట్టం మరియు మానభంగకేసులను ముందుకు తీసుకెళ్లేలా చేయడం టాస్క్ ఫోర్స్ యొక్క ముఖ్య లక్ష్యం. అందువల్ల అధిక సంఖ్యలో పేరుకుపోయి ఉన్న UI కేసులు ఘననీయంగా తగ్గాయి మరియు ఎన్నో కేసులు చివరి దశలో ఉన్నాయి.

భరోసాకు గుర్తింపు

భారత సర్వోన్నత న్యాయస్థానం భరోసాను గుర్తించినది

మదన్ బి. లోకుర్ మరియు దీపక్ గుప్తా గల, నిపున్ సక్సేనా మరియు Ors. Vs. యూనియన్ ఆఫ్ ఇండియా మరియు Ors. యొక్క రిట్ పిటిషన్ (సివిల్) No.565 of 2012, W.P.(Crl.)Nos 1,22 148 of 2013, SLP (Crl.) Crl.M.P.No.16041/2014 and W.P(C) No.568 of 2012, 11-12-2018న నిర్ణయించబడినది.

SKOCH ఆర్డర్ ఆఫ్ మెరిట్ - వెండి

SKOCH సంస్థ వారి SKOCH ఆర్డర్ ఆఫ్ మెరిట్ - వెండి అవార్డును ఫిబ్రవరి 25, 2019న 'భరోసా'కు న్యూ ఢిల్లీలో అందజేశారు. భరోసా కేంద్రాలను నిర్వహిస్తున్నందుకు గాను హైదరాబాద్ నగర పోలీసులను భారతదేశంలో అత్యుత్తమ పోలీసు మరియు అత్యవసర సేవలు అందించే వారిలో ఒకరిగా గుర్తించారు.

మా భాగస్వామి సంస్థలు

Our NGO Partner

Tharuni NGO
mamatha[at]tharuni[dot]org
#27, Nagarajuna Colony
Vyshalinagar Post, Champapet
Hyderabad–500079
www.tharuni.org

అవగాహన కల్పించేందుకు చేతులు కలపండి

భరోసాతో భాగస్వాములు అవ్వండి

పాఠశాలలు, కాలేజీలు మరియు సంఘాలలో అవగాహనా కార్యక్రమాలు

అవగాహనా కార్యక్రమాల ద్వారా పిల్లలకు అసభ్యకర ప్రవర్తన గురించి విషయపరిజ్ఞానం అందజేయడం, ఎటువంటి దుర్ఘటనలు జరిగినా ఎవరికి మరియు ఎలా వీటి గురించి ఫిర్యాదు చేయడం అనే అంశాల మీద సమాచారం అందించబడును. అంతేకాకుండా, ఇటువంటి ట్రామాటిక్ సంఘటనలు జరిగిపినప్పుడు కలిగే మానసిక ఒత్తుళ్ళు, వాటి నుండి బయటపడడానికి మానసిక సంరక్షణ మరియు కౌన్సెలింగ్ యొక్క అవసరం గురించి కూడా తెలుపుతుంది. వివిధ సంఘాలలో జరిపే అవగాహనా కార్యక్రమాల ద్వారా గృహ హింస, ఇతర అసభ్యకర ప్రవర్తనల గురించి సమాచారం అందించడం, ఇటువంటి పరిస్థితిలో ఫిర్యాదు చేయడం మరియు మహిళలు, పిల్లల యొక్క చట్టపరమైన హక్కుల గురించి తెలుసుకోవడం ఎలాగో తెలియజేస్తారు.

ఔట్-రీచ్ సోషల్ వర్కర్స్

'భరోసా'లో అత్యుత్తమ శిక్షణ పొందిన ఔట్-రీచ్ సామజిక కార్యకర్తల బృందం ఉంటుంది, వీరు పాఠశాలల్లో మరియు సంఘాలలో అవగాహనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఏ విధమైన సమస్యను ఎలా ఎదుర్కొనాలో సూచించగలరు. ప్రారంభం అప్పటి నుండి, భరోసా ఔట్-రీచ్ బృందం 192 అవగాహనా కార్యక్రమాలను నిర్వహించింది. పాఠశాలలు, కాలేజీలు మరియు సంఘాలలో 2,00,000 కు పైగా వ్యక్తులకు POCSO చట్టం, స్త్రీ & శిశు సంరక్షణ, ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఇలా అన్ని విషయాలను అందరికి అర్థమయ్యే విధంగా ఈ బృందం విశదీకరిస్తుంది.

స్టేక్-హోల్డర్స్ కు శిక్షణ మరియు అవగాహన వర్క్ షాప్ లు

'భరోసా'తో అనుసంధానం అయ్యున్న NGOలు, పోలీసులు, ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వ న్యాయవాదులు, MEPMA క్షేత్ర అధికారులు మరియు ఇతర వ్యక్తులకు శిక్షణ మరియు అవగాహన వర్క్ షాప్ లు నిర్వహించడం జరుగుతుంది. అక్టోబర్ 2018లో ఉపాధ్యాయులకు పిల్లల పట్ల లైంగిక వేధింపుల వల్ల కలిగే ఇబ్బందుల గురించి తెలుపడానికి వారికి ప్రత్యేకంగా ఎన్నో అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.

సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి