స్త్రీ సంరక్షణ శాఖలోని డొమెస్టిక్ వయోలెన్స్ మాడ్యూల్ యొక్క ముఖ్య ఉద్దేశం గృహ హింస మరియు వరకట్న వేధింపులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం. స్త్రీ మరియు శిశు సంరక్షణకు సంబంధించిన కేసులను పర్యవేక్షించడం, అవగాహన తీసుకురావడం మరియు వివిధ స్టేక్-హోల్డర్స్ సహాయంతో బాధితులకు పరిష్కారం చూపడం జరుగుతుంది.
జీవసంబంధమైన బంధువుల (బయోలాజికల్ రిలేటివ్స్) వల్ల ఎవరైనా వ్యక్తి వేధింపులకు గురైతే అది గృహ హింస కిందకు వస్తుంది, సాధారణంగా ఇటువంటి దుర్ఘటనలు స్త్రీ ఆమె ఇంట్లో ఉండే మగవాళ్ళ వల్ల లేదా కుటుంబం వల్ల లేదా బంధువుల వల్ల అనుభవిస్తుంది. వేధింపులు శారీరికమైనవే కానవసరం లేదు. స్త్రీ హక్కులకు భంగం కలిగించే దుర్భాషలు ఆడటం, మానసిక హింస, లైంగిక హింస మరియు ఆర్థిక ఒత్తిళ్ళకు లోను చేయడం కూడా గృహ హింసే. గృహ హింసను అరికట్టడానికి అనేక చట్టాలు తీసుకు రావడం జరిగింది. వరకట్న నిషేధ చట్టం, 1861 ప్రవేశపెట్టినప్పటి నుండి కట్నం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండూ నేరాలుగా పరిగణింపబడుతున్నాయి.
ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇండియన్ పీనల్ కోడ్ (IPC)కు 1983 మరియు 1986 సంవత్సరాలలో సెక్షన్ 498 A మరియు 304 B లని ప్రవేశపెట్టారు. 2005 లో ప్రవేశపెట్టిన PWDVA (ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయోలెన్స్ యాక్ట్) అనే పౌర చట్టం ద్వారా మనం ఇప్పుడు చూస్తున్న విస్తారమైన గృహ హింస నిర్వచనాన్ని చూస్తున్నాము. ఈ చట్టం ద్వారానే గృహ హింసలో భాగంగా దుర్భాషలు ఆడటం, మానసిక హింస, లైంగిక హింస మరియు ఆర్థిక ఒత్తిళ్ళకు లోను చేయడం వంటి అంశాలను చేర్చారు.
వ్యక్తి సంప్రదించిన తర్వాత పిటిషన్ రిజిస్టర్‌లో నమోదు చేయడం.
దరఖాస్తుదారుని మాడ్యూల్ I/C అధికారి వద్దకు పంపుతారు. మాడ్యూల్ I/C అధికారి పిటిషన్ పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (PS SHO)తో చర్చించి వీలైనంత త్వరగా పరిష్కారం పొందేలా చర్యలు చేపడతారు.
పిటీషన్ యొక్క వివరాలు ఫేజ్-1 మరియు II ప్రొఫార్మాలో నమోదు చేయబడతాయి మరియు సంబంధిత యూనిట్ కు మెమో ద్వారా చేరుతాయి. ఇందులో ముందస్తు తేదీలలో తీసుకున్నటువంటి చర్యలు మరియు నివేదికలు చేర్చి ఫేజ్-III ప్రొఫార్మాగా కార్యాలయానికి పంపబడుతుంది.
మాడ్యూల్ సిబ్బంది పిటిషన్ ను అనుసరించి సంబంధిత యూనిట్ల నుండి యాక్షన్ రిపోర్టులను సేకరిస్తారు మరియు నివేదికలను పై అధికారులకు సమర్పిస్తారు.
కరోనా మహమ్మారి దేశం మొత్తాన్ని లాక్ డౌన్ అయ్యేలా చేయగా, తెలంగాణ పోలీసులు గృహ హింస మీద కౌన్సెలింగ్ అందించడంలో సాంకేతికతను ఉపయోగించుకున్నారు. ఎంచుకోబడ్డ కౌన్సిలర్లు IVR సిస్టమ్ ద్వారా వచ్చిన ఫోన్ కాల్స్ ను స్వీకరించి ప్రతి కేసుకు సరైన విధివిధానాలు వివరించడం జరుగుతుంది. IVR సిస్టమ్ ద్వారా కాల్ చేయాలనుకున్న వారు తమకు ఏ భాషలో కౌన్సిలర్ మాట్లాడాలో ఎంచుకోవచ్చు. ఎంచుకున్న భాషను బట్టి అందుబాటులో ఉన్న కౌన్సిలర్ కు కాల్ కలపబడుతుంది. ఇంటి ద్వారానే సహాయం అందించే కౌన్సిలర్లు ఫిర్యాదుదారుల సమస్యలకు సరైన రీతిలో సమాధానం అందించే ప్రయత్నం చేస్తారు. IVR సిస్టమ్ లోని మరొక సానుకూల అంశం ఏమిటంటే, ఎవరైనా ఫిర్యాదుదారు ఎక్కువ సార్లు కాల్ చేయాల్సి వస్తే అతని కాల్ ను ఒకే కౌన్సిలర్ కు పంపబడుతుంది, దీని ద్వారా వారి సమస్య త్వరగా పరిష్కారం అయ్యే అవకాశాలు మెరుగవుతాయి. IVR సిస్టమ్ కాల్‌లను స్వీకరిస్తుంది మరియు కాలర్ కోసం ప్రాధాన్య భాషని కోరుతుంది. ఎంచుకున్న భాష ఆధారంగా, అందుబాటులో ఉన్న కౌన్సెలర్‌కు కాల్ మళ్లించబడుతుంది. ఇంట్లో నివసించే కౌన్సెలర్లు కాల్ ద్వారా కేసును స్వీకరించి, COVID19 నిబంధనలకు అనుగుణంగా అవసరమైన కౌన్సెలింగ్‌ను అందిస్తారు. బాధితుడు బహుళ పరస్పర చర్యలను కలిగి ఉండాలనుకుంటే IVR సిస్టమ్ స్వయంచాలకంగా అదే కౌన్సెలర్‌కు కాల్‌ను రూట్ చేస్తుంది.
ఈ పరిజ్ఞానం వల్ల పోలీసులు దూరం నుండి మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి వీలవుతుంది మరియు కౌన్సిలర్-ఫిర్యాదుదారు మధ్య సంభాషణను డిజిటల్ గా రికార్డు చేయడానికి కుదురుతుంది. అంతేకాకుండా కౌన్సిలర్ల పని తీరును కూడా సమీక్షించే అవకాశం లభిస్తుంది. కౌన్సెలర్లకు ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ యాప్ కూడా అందించడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా వారు బాధితుల వివరాలు తెలుసుకోవడం, కౌన్సిలింగ్ అందజేసిన సమయం, కాల్ రికార్డులు వినడం వంటివి చేయొచ్చు.