స్త్రీ సంరక్షణ విభాగం, తెలంగాణ యొక్క వివిధ మాడ్యూల్లకు విశ్లేషణా మాడ్యూల్ సహాయ సహకారాలు అందిస్తుంది. స్త్రీలు మరియు చిన్నపిల్లలకు సంబంధించిన ఫిర్యాదులను పర్యవేక్షించి వారి పట్ల నేరాలు జరగకుండా ప్రయత్నిస్తుంది. POCSO చట్టం కింద నమోదైన కేసులలో నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (సెక్సువల్ ఆఫీసెస్ మాడ్యూల్) కు ఈ మాడ్యూల్ సహాయం చేస్తుంది. సైబర్ క్రైమ్ మరియు మనుష్యుల అక్రమ రవాణా కేసులలో బాధితులను గుర్తించడం (కనపడకుండాపోయిన/కిడ్నాప్ అయిన వ్యక్తి), అనుమానితులను/ప్రతివాదులను/నిందితులను పట్టుకోవడం వంటి వాటిలో విచారణలో భాగమైన మాడ్యూల్-అధికారులకు ఈ విభాగం సహాయం అందిస్తుంది.
ఈ విభాగము డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి నేతృత్వంలో ఉంటుంది. Dy. S.P తోపాటు ఒక ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఒక హెడ్ కాన్స్టేబుల్ మరియు ఇద్దరు పోలీస్ కాన్స్టేబుల్స్ ఉంటారు.
విశ్లేషణ విభాగం యొక్క లక్ష్యాలు
To maintain the SHE Software, Complaints through She Teams WhatsApp, CCTNS, Darpan Application & Child Track Portal (Updating & verification of missing person particulars with latest photographs), C-DAT (Analysis utilise case data tool for identifying missing/suspect/ accused persons), other open-source tools in order to assist all module investigating officers.
PR బృందంతో కలిసి స్త్రీ సంరక్షణ విభాగం సామజిక మాధ్యమాలను మరియు వెబ్సైట్ ను నిర్వహించడం.
అవగాహన కార్యక్రమాలను నిర్వహించడానికి వాలంటీర్లతో సమన్వయం చేసుకోవడం.
సంబంధిత అధికారులకు కార్యాలయం నుండి మెమోలు, ఇతర పత్రాలను ఈ-మెయిల్ ద్వారా అందజేయడం.