స్త్రీ సంరక్షణ విభాగం, తెలంగాణ పోలీస్ ఉనికిలో ఉన్న ఇన్ని సంవత్సరాలలో మహిళలకు మరియు పిల్లలకు తెలంగాణ రాష్ట్రం అత్యంత సురక్షితమైనదిగా తీర్చిదిద్ధేందుకు అడుగులు వేసింది. ఈ ప్రయాణంలో స్త్రీ సంరక్షణ విభాగం ఎన్నో విజయాలను, మరెన్నో ప్రశంసలను అందుకుంది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి కింద పొందుపరుస్తున్నాము.
SHE టీమ్స్ మరియు భరోసాకు గాను స్త్రీ సంరక్షణ విభాగం, తెలంగాణ పోలీసుకు SKOCH ఆర్డర్-ఆఫ్-మెరిట్ బహుకరణ
2021 స్వాతంత్ర్య దినోత్సవం నాడు శ్రీమతి స్వాతి లక్రా IPS, ADGP WSW గారి విశిష్ట సేవకు రాష్ట్రపతి పోలీసు పతకం
శ్రీమతి సుమతి బడుగుల IPS, స్త్రీ సంరక్షణ విభాగానికి DIGకు "బెస్ట్ కోవిడ్ వారియర్ విమెన్ ఆఫీసర్" గా గుర్తింపు. చావంటే భయం లేకుండా మహమ్మారి సమయంలో సమాజ సేవకు అంకితమైనందుకు ఈమెకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది.
డాక్టర్. హీనా గవిట్ గారి నేతృత్వంలో మహిళా సాధికారత కోసం పార్లమెంటరీ బృందం తమ అధ్యయనంలో భాగంగా హైదరాబాద్ మరియు విశాఖపట్నం వచ్చినప్పుడు తెలంగాణ స్త్రీ సంరక్షణ విభాగాన్ని సందర్శించారు. శ్రీమతి స్వాతి లక్రా, IPS గారు సభ్యులకు WSW చేస్తున్న కార్యకలాపాల గురించి వివరించారు, మహిళల సంరక్షణ కోసం WSW చేస్తున్న కృషిని డాక్టర్. హీనా గవిట్ కొనియాడారు.
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో శ్రీ జగదీష్ - ఇంధన శాఖ మంత్రి, శ్రీ మహేందర్ రెడ్డి - IPS, DGP మరియు శ్రీమతి స్వాతి లక్రా IPS, ADGP WSW చేతులు మీదుగా 5వ భరోసా కేంద్రం ప్రారంభమయ్యింది. ఈ కేంద్రాన్ని SLN Terminus మరియు ARC groups వారు స్పాన్సర్ చేశారు.
తెలంగాణాలో జరిపిన 7వ ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా 3178 మంది చిన్నపిల్లలను కాపాడడం జరిగింది. వీరిలో 805 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు, 717 మంది వీధిబాలలు, 147 ఇటుకుల బడ్డీలో పనిచేసినవారు, 630 మంది బంధిత కూలీలు & 116 మంది భిక్షమెత్తేవారు. బాల కార్మికుల చట్టం కింద 232 కేసులు నమోదయ్యాయి.
Taruni NGO & UK in India వారి సహకారంతో తెలంగాణ రాష్ట్ర స్త్రీ సంరక్షణ విభాగం దేశంలో మొట్టమొదటిది అయిన మనుష్యుల అక్రమ రవాణా గురించి సమగ్ర సమాచారం అందించే పోర్టల్ "ధ్రువ"ను ఏర్పాటు చేసింది.
స్టేక్ హోల్డర్స్ సహాయంతో తెలంగాణ రాష్ట్ర పోలీసు వారు ప్రారంభించిన 'సేవా ఆహార ప్రాజెక్ట్' ద్వారా కోవిడ్-19 రెండో దశ సమయంలో 1,50,000 కరోనా రోగులకు ఉచిత ఆహారం అందజేయడం జరిగింది.
స్త్రీ సంరక్షణ విభాగంలో DGP శ్రీ ఎమ్. మహేందర్ రెడ్డి IPS గారు అత్యాధునికమైన SHE-సైబర్ ల్యాబ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్‌లోని సీనియర్ పోలీసు అధికారులు, ఏడీజీపీ, డీఐజీ, సీపీలు హాజరయ్యారు. WSW చేసిన పనికి సంబంధించిన 4 ప్రచురణలు కూడా విడుదల చేయబడ్డాయి.