మనుష్యుల అక్రమ రవాణాను ఆపండి, ఈ దుస్థితిని అంతమొందించండి

యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (మానవ రవాణా నిరోధక శాఖ)

AHTU లేదా మానవ రవాణా నిరోధక శాఖలోని స్త్రీల పరిరక్షణా ఉపశాఖ అక్రమ రవాణాకు గురైన వారికి సమగ్రమైన రక్షణ, భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా నియంత్రణ మరియు రీహాబిలిటేషన్ కల్పిస్తుంది. తెలంగాణలోని ప్రతి జిల్లాలో AHTU పనితీరును సమీక్షించడానికి నోడల్ ఏజెన్సీగా స్త్రీల పరిరక్షణా విభాగం పనిచేస్తుంది. అనేకమైన స్టేక్-హోల్డర్స్ సహాయంతో తెలంగాణ రాష్ట్రంలో మనుష్యుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడం ముఖ్య లక్ష్యంగా పని చేయడం జరుగుతుంది.

మేము సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాము

మమ్మల్ని చేరుకోండి

AHTUని ఎప్పుడు సంప్రదించాలి?

AHTU గురించి

మానవ రవాణా నిరోధక శాఖలోని స్త్రీల పరిరక్షణా ఉపశాఖ అక్రమ రవాణాకు గురైన వారికి సమగ్రమైన రక్షణ, భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా నియంత్రణ మరియు రీహాబిలిటేషన్ కల్పిస్తుంది. తెలంగాణలోని ప్రతి జిల్లాలో AHTU పనితీరును సమీక్షించడానికి నోడల్ ఏజెన్సీగా స్త్రీల పరిరక్షణా విభాగం పనిచేస్తుంది. అనేకమైన స్టేక్-హోల్డర్స్ సహాయంతో తెలంగాణ రాష్ట్రంలో మనుష్యుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడం ముఖ్య లక్ష్యంగా పని చేయడం జరుగుతుంది.

మనుష్యుల అక్రమ రవాణా అనే పెనువిపత్తును ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం 31 జిల్లాల్లో/పోలీస్ కమిషనరేట్లలో AHTU శాఖలను ఏర్పాటు చేసింది. AHTU యొక్క "ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్" కార్యక్రమం ద్వారా మనుష్యుల అక్రమ రవాణా అనే ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కునే దిశగా అడుగులు వేస్తోంది. అక్రమ రవాణా అనేది చాలా పకడ్బందీగా నడిచే డిజిటల్/ఆన్‌లైన్ నేరం, ఈ నేరాన్ని అరికట్టేందుకు మానవ రవాణా నిరోధక శాఖ అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది.

AHTUల కూర్పు

ప్రతి AHT యూనిట్ బలిష్ఠమైనదిగా ఉండేందుకు ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు సబ్-ఇన్స్పెక్టర్లు, ఇద్దరు హెడ్ కాన్స్టేబుల్స్, నలుగురు పోలీస్ కాన్స్టేబుల్స్ (కనీసం ఒక్క మహిళా కాన్స్టేబుల్) అందుబాటులో ఉంటారు మరియు అవసరమైన లాజిస్టిక్స్ కూడా ఏర్పాటు చేసియున్నది.

ధ్రువ పోర్టల్

మనుష్యుల అక్రమ రవాణా గురించి ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమగ్ర విజ్ఞాన వేదికే "ధ్రువ". తెలంగాణాలో అక్రమ రవాణాకు కళ్లెం వేసేందుకు తీసుకున్న ముందడుగే ఈ వెబ్ పోర్టల్. తెలంగాణ జిల్లాలలోని AHTUలను బలపరచడం ద్వారా సమర్ధవంతమైన నివారణ, సంరక్షణ మరియు ప్రాసిక్యూషన్ సాధించగలం అనే నినాదంలో భాగంగా ఏర్పడిన వేదికే ఈ ధ్రువ పోర్టల్.

మార్పునకు ముందడుగు పడాలంటే మొదట సమస్య ఏమిటి మరియు దాని గురించి వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. ఈ అవగాహనను స్టేక్-హోల్డర్స్, పోలీసులు మరియు ప్రజానీకంలోకి తీసుకురావడానికి మరియు వారిలో జాగృతిని పెంచడానికి ఏర్పాటు చేసిందే ధ్రువ పోర్టల్. సంభావిత వివరణల నుండి ప్రోటోకాల్‌లు మరియు మార్గదర్శకాల వరకు, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ‘ధ్రువ’ డేటాబేస్‌గా పనిచేస్తుంది.

మనుష్యుల అక్రమ రవాణా అంశం మీద సమగ్రమైన సమాచారంతో ఒక సంపూర్ణ గ్రంథాలయంలా 'ధ్రువ' వ్యవహరిస్తుంది. పోలీసులు, లాయర్లు, సేవా సంస్థలు, సాధారణ వ్యక్తులు ఎవరైనా సరే ఈ పోర్టల్ ద్వారా మనుష్యుల అక్రమ రవాణా, జరుగుతన్న అక్రమాలు మరియు ఇతర అంశాల గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. అంతేకాదు మీ విషయపరిజ్ఞానం ఏ స్థాయిలో ఉందో కూడా పరీక్షించుకోవచ్చు. ధ్రువలో ఉంచిన సారమంతా ఇంగ్లీషులో మరియు తెలుగులో అందుబాటులో ఉంటుంది. "ఈ-అసెన్స్మెంట్" రెండు స్థాయిలలో ఉంటుంది: బేసిక్ మరియు అడ్వాన్స్డ్. అసెన్స్మెంట్ విజయవంతంగా పూర్తి చేస్తే సర్టిఫికెట్ కూడా లభిస్తుంది.

SHE టీం ముఖ్యాంశాలు

స్థాపన
2015
ప్రతి నెలా కనుగొనబడిన/కాపాడబడిన పిల్లలు
900 s

Operation Muskaan/Smile

మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, న్యూ ఢిల్లీ వారి ఆదేశాల మేరకు 2015 నుండి తెలంగాణ రాష్ట్రం ఆపరేషన్ ముస్కాన్ (చిరునవ్వు) ను ప్రతి జనవరి మరియు జులై మాసాలలో ఆచరణలో పెడుతుంది. ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా ఒక SI, నలుగురు పోలీస్ కాన్స్టేబుల్స్ బృందాలుగా విభజించి ప్రతి సబ్-డివిజన్ కు ఏర్పాటు చేస్తారు. వీరు కనిపించకుండా పోయిన పిల్లలను, పారిపోయిన పిల్లలను, అక్రమ రవాణాకు గురైన పిల్లలను, బాలకార్మికులను, బంధిత కార్మికులను, శిక్షిత భిక్షగాళ్లను, వీధి బాలలను మరియు పనివాళ్లుగా పనిచేసే పిల్లల జాడను వెతికి పట్టుకుంటారు. ఆపరేషన్ ప్రారంభించే ముందు WDCW, రెవెన్యూ, లేబర్, రైల్వే, సోషల్ వెల్ఫేర్, NGOలు, విద్యాశాఖ, ఆరోగ్యశాఖ, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వంటి అనేక శాఖలతో సమావేశం ఏర్పాటు చేసి సమన్వయంతో ఒక నిర్ణయానికి వస్తారు. పోలీసు బృందాలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి ఆపరేషన్ లో భాగంగా పాటించవలసిన నియమాలు, చట్టపరమైన విధానాలు, JJ చట్టం మరియు POCSO చట్టం గురించి పూర్తిగా వివరించి వారిలో స్ఫూర్తిని నింపుతారు. కనపడకుండా పోయిన పిల్లల వివరాలను "ట్రాక్ చైల్డ్ పోర్టల్" లో అప్‌లోడ్ చేయమని వారికి చెప్పడం జరుగుతుంది. ఆపరేషన్ ముస్కాన్ సమయంలో ఇతర రాష్ట్రాల పిల్లలు కనుగొనబడితే సంబంధిత రాష్ట్రాలకు వీరిని సురక్షితంగా తరలించడానికి బృందాలను ఏర్పాటు చేసుకోమని సందేశాలు వెళ్తాయి.

AHTU తెలంగాణ - నిర్ణీత కార్య విధానాలు (SOP)

ఎఫ్‌ఐఆర్‌కు ముందు కార్యకలాపాలు

Collect intelligence on traffickers, interrogation of suspects, develop & update a database of traffickers.

కాపాడుటకు ముందు కార్యకలాపాలు

సమాచారం యొక్క వాస్తవికతను ధృవీకరించుకుని, సత్వర చర్యలు తీసుకొనుట. అవసరం ఉన్న చోట చట్టబద్దమైన అనుమతులు తీసుకోవడం, ఆకస్మిక అవసరాలు మరియు లాజిస్టిక్స్ ను ముందుగానే ఊహించి ముందుకు సాగడం.

రెస్క్యూ ఆపరేషన్

రెక్కీ నిర్వహించి, అవసరమైన బృందాలను మరియు ప్రణాళికలను సిద్ధం చేసుకుని, NGOలను సంప్రదించి, అవసరమైన డాక్యుమెంటేషన్ సిద్ధం చేసుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది.

ఎఫ్‌ఐఆర్‌ నమోదు

ఎఫ్ఐఆర్ లో తగిన సెక్షన్లు చేర్చుట, ITPA తోపాటు IPC సెక్షన్లు కూడా అవసరం మేర చేర్చుట. విచారణ సమయంలో ఇతర నేరాలు బయటపడితే వాటిని కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తారు.

విచారణ

The investigation process comprises of collection of material objects, search, interrogation of suspects & accused and arrest of the accused.

నిందారోపణ పత్రం

సరైన మరియు క్రమమైన ఛార్జ్ షీట్ తయారు చేయడం నేరారోపణను నిర్ధారించడంలో అత్యవసరం (sine-qua-non). మానవ అక్రమ రవాణా వ్యవస్థీకృత నేరం కాబట్టి, నేరం-నేరస్థుడు-సాక్ష్యం యొక్క మాతృకను సిద్ధం చేసి, దానిని CDలో ప్రదర్శించబడుతుంది.

ప్రాసిక్యూషన్

కేసు యొక్క వాస్తవాలపై మాత్రమే కాకుండా, బాధితుల ట్రామాలు, వ్యవస్థీకృత నేరాల అనుసంధానం మొదలైన వాటిపై కూడా ప్రాసిక్యూటర్‌లకు వివరించడం, కౌన్సెలర్లు లేదా NGOల సహాయంతో బాధితుడిని కోర్టులో వాంగ్మూలం కోసం సిద్ధం చేయుట.

రెఫరల్ మెకానిజం

రిఫరల్ మెకానిజం యొక్క ముఖ్య ఉద్దేశం అక్రమ రవాణాకు గురైన వ్యక్తులకు రిహాబిలిటేషన్ కల్పించడం, కౌన్సెలర్లకు సిఫార్సు చేయడం, మానసిక మెరుగుదల కోసం & ఉపశమనం కోసం సైకలాజికల్ ఇంటర్వెన్షన్ అందించడం, చట్టపరమైన ప్రాతినిధ్యం మరియు బాధితులకు పరిహారం కల్పించడం.

Prevention & Rehabilitation

చురుకైన విధంగా చట్టాలను అమలు చేసి అక్రమ రవాణాదారులను ఖైదు చేయుట, దీని ద్వారా మనుష్యుల అక్రమ రవాణాను నివారించడం. ప్రజ్వల వంటి భాగస్వాముల ద్వారా బాధితులకు సరైన పునరావాసం కల్పించడం. మూలాలను మరియు రవాణా ప్రదేశాలను కట్టడి చేసి, అక్రమ రవాణా పునరావృత్తం కాకుండా పూర్తిగా నివారించడం.

AHTU భాగస్వాములు

మానవ అక్రమ రవాణాకు సంబంధించిన నేరాలతో బాధపడిన మహిళలు మరియు పిల్లలకు మద్దతుగా నిలిచేందుకు AHTU వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర మరియు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర కమిషన్, NCPCR, SCPCR, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మరియు ఇతర NGOలు AHTU భాగస్వాములుగా ఉన్నారు.

తాజా AHTU నవీకరణలు

సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి