తప్పిపోయిన వ్యక్తుల పర్యవేక్షణ సెల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే తప్పిపోయిన వ్యక్తులను అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి వెతికి పట్టుకుని వారి కుటుంబాలకి తిరిగి అప్పచెప్పడం.
UNICEF, WCD మరియు NIC ముఖ్య స్టేక్-హోల్డర్స్ గా గల సెల్ కనపడకుండా పోయిన వారిని వెతుకుతూ, దొరికిన వాళ్ళని సురక్షితంగా కుటుంబాలకి చేరవేయడం లేదా పునరావాసం కల్పించడం చేస్తుంది.
సెల్ లోని రిసెప్షన్ లో మహిళా పోలీస్ కాన్స్టేబుల్స్ ఉంటారు. వీరు హెల్ప్ డెస్క్ ద్వారా తప్పిపోయిన వారి గురించి వివరాలు సేకరించి ఫిర్యాదు నమోదు చేసుకుంటారు.
తప్పిపోయిన వారి కేసులకు సంబంధించిన సమాచారం దగ్గరలోని CCI/DCPU, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మొదలైన వాటికి పంపబడతాయి.
Victims can file complaints on Dhruv website, WhatsApp (8712656858) or as email to TS Police Mail ID, AHT mail or Official police mail IDs.